March 08 2024మార్చి 08 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 08 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం

తిథి: త్రయోదశి రా.  8.12 కు తదుపరి చతుర్దశి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: శ్రవణం ఉ.  8.35 కు తదుపరి ధనిష్ఠ
యోగం: శివ రా. 12.46 కు తదుపరి సిద్ధ రా.  08.32 కు
కరణం: గరజి ఉ.  11.41 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.  08.52 - 09.40 కు & మ.  12.51 - 01.38 కు
వర్జ్యం: మ. 12.20 - 1.50  కు
అమృతకాలం: రా.  9.22 - 10.52 కు
సూర్యోదయం: ఉ.  6.29 కు
సూర్యాస్తమయం: సా.  6.25 కు

🕉️👉మహాశివరాత్రి, లింగోద్భవకాల పూజ అర్ధరాత్రి 12.00 గం.లకు👈🕉️

గురుబోధ 
ఉత్తమోత్తమమైన శివలింగం ఏమిటి అంటే గురువు చేత ప్రతిష్ఠ చేయబడ్డ లింగం. గురుదేవుల సన్నధిలో జరిగే శివరాత్రి అభిషేకములు చూడక, వారి దర్శనం చేసుకోక, ఆయన అనుమతి లేక ఏ జ్యోతిర్లింగము దగ్గరికి వెళ్లినా సంపూర్ణ ఫలితం రాదు అని నందీశ్వరుడు చెప్పాడు.
శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే, అష్టమి, చతుర్దశి తిథుల్లో ఒక లక్ష బిల్వపత్రాలతో, శంఖపుష్పాలతో భక్తితో శివుడ్ని అర్చిస్తే శత్రుపీడ పొతుంది. కీర్తి కావాలంటే, సహస్ర తులసీదళాలు పరమశివునికి సమర్పించాలి.
విభూతి లేని నుదురు చూసినచో పాపం అన్నారు పెద్దలు, గురువులు. విభూతి ధరించినవారికి యమదర్శనం ఉండదు. విభూతి ధరించి ప్రయాణం చేసినచో ప్రమాదములు జరుగవు. ఉదాహరణకి ఉపమన్యువు తన తల్లి ఇచ్చిన విభూతితో ఇంద్రుడిని కూడా జయించాడు. పొద్దుట నీటితో కలిపి ధరించాలి. సాయంకాలం పొడిగా ధరించాలి. భస్మధారణ శివునికి చాలా ప్రీతి, అన్ని శుభాలను ప్రసాదిస్తుంది.

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్👇


శివలింగ పూజా విధానములు👇


శివలింగార్చన👇


expand_less