" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 08 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము తిథి : పాడ్యమి రా. 07గం౹౹13ని౹౹ వరకు తదుపరి విదియ వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : ఉత్తర (9వ తేదీ) తె. 04గం౹౹03ని౹౹ వరకు తదుపరి హస్త యోగం : శూల రా. 09గం౹౹20ని౹౹ వరకు తదుపరి గండ కరణం : బాలవ ఉ. 06గం౹౹58ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹50ని౹౹ నుండి 12గం౹౹37ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 10గం౹౹01ని౹౹ నుండి 11గం౹౹44ని౹౹ వరకు అమృతకాలం : రా. 08గం౹౹19ని౹౹ నుండి 10గం౹౹02ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹19ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹06ని౹౹కు గురుబోధ: కాశీలో గురుపూజ చేసిన వాళ్ళకి కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. శ్లో ౹౹ విశ్వేశం మాధవం డుంఠిమ్ దండపాణిం చ భైరవం l వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ll - (కాశీఖండం) కాశీక్షేత్రములోని ప్రధాన దేవతలందరిని స్మరించుకునే ధ్యాన శ్లోకము. ప్రతినిత్యం ఈ శ్లోకం తలచుకోవడం వల్ల దేవతల అనుగ్రహం కలిగి కాశీవాస ఫలితం లభిస్తుంది. శ్రీ కాలభైరవ అష్టకమును ప్రతిరోజూ పారాయణం చేయడం వల్ల తప్పక కాశీ నివాస ఫలితం కలుగుతుంది.