March 07 2026మార్చి 07 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 07 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్థి సా.6.44 కు తదుపరి పంచమి 8 రా.8.19 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: చిత్ర ఉ.10.59 కు తదుపరి స్వాతి 8 మ.1.01 కు
యోగం: ధ్రువ ఉ.7:03 కు తదుపరి వ్యాఘాత 8 ఉ.7:35 కు
కరణం: బాలవ రా.7:17 కు తదుపరి తైతుల 8 రా.9:11 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.08 - 8.55 కు
వర్జ్యం: సా.5.04 - 6.48 కు
అమృతకాలం: తె. 03.53 - 05.38 కు
సూర్యోదయం: ఉ. 6.33 కు
సూర్యాస్తమయం: సా. 6.20 కు

గురుబోధ:
మతిమరుపు ఉన్న వారికి మళ్ళీ జ్ఞాపకశక్తి వచ్చి తెలివితేటలు పెరగాలి అంటే ప్రతి రోజు శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి. చెంబుడు పాలతో, బిందెడు పాలతో లేక పంచపాత్రలో పోసిన పాలతో అభిషేకించి, అభిషేకించగా వచ్చిన ధారను ఒక పాత్రలో పట్టుకుని పూజ అయిపోయాక తీర్ధంగా తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి , తెలివితేటలు పెరుగుతాయి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less