March 07 2024మార్చి 07 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 07 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం

తిథి: ద్వాదశి రా. 10.17 కు తదుపరి త్రయోదశి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.  9.50 కు తదుపరి శ్రవణం
యోగం: వరీయాన్ ఉ.  08.24 కు తదుపరి పరిఘ
కరణం: కౌలవ మ.  02.50 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.  10.28 - 11.16 కు & మ.  03.14 - 04.01
వర్జ్యం: మ.  1.37 - 3.08 కు
అమృతకాలం: రా.  10.44 - 12.15 కు
సూర్యోదయం: ఉ.  6.30 కు
సూర్యాస్తమయం: సా.  6.24 కు

👉🕉️ శ్రీశ్రీశ్రీ కంచి శంకర విజయేంద్రసరస్వతీస్వామి జయంతి 🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చెయ్యాలి.

గురుబోధ:
మారేడుచెట్టు శివుని స్వరూపమే. శివునికీ, బిల్వవృక్షానికీ తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతిభక్తితో స్తుతిస్తారు. ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో అవన్నీ మారేడుచెట్టు మూలంలో (వ్రేళ్ళలో) ఉంటాయి. మారేడుచెట్టు మూలంలో లింగం ఒకదానిని కాని లేదా అనేక లింగాలను కాని ఉంచి పూజించినవాడు పరమపుణ్యాత్ముడౌతాడు. శివుని సన్నిధిని పొందగలుగుతాడు. మారేడుచెట్టు క్రింద స్నానం చేసినవాడు, సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాఫలం పొంది, పవిత్రుడౌతాడు. గంధపుష్పాదులతో మారేడుచెట్టు మొదలును పూజించినవాడు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు. మారేడుచెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడై, తత్త్వజ్ఞానం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు. అందునా, కార్తికమాసంలోనూ, మాఘమాసంలోనూ, ప్రతి మాసశివరాత్రికీ, మారేడు దగ్గర ఆవునేతిదీపం వెలిగించినవాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది.

శివకవచం👇


expand_less