March 06 2024మార్చి 06 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 06 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం

తిథి: ఏకాదశి రా.  12.07 కు తదుపరి ద్వాదశి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.  10.48 కు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వ్యతీపాత ఉ.  11.33 కు తదుపరి వరీయాన్
కరణం: బవ సా.  05.27 కు తదుపరి బాలవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.  12.04 - 12.51 కు
వర్జ్యం: సా.  6.28 - 8.01 కు
అమృతకాలం: తె.  3.43 - 5.15 కు & ఉ. 6.13 - 7.43 కు 
సూర్యోదయం: ఉ.  6.31 కు
సూర్యాస్తమయం: సా.  6.24 కు

👉🕉️ ఏకాదశి 🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చెయ్యాలి.

గురుబోధ:
శివరాత్రికి ఉపవాసం చేసి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి, తన శక్తిననుసరించి నన్ను పూజించిన వ్యక్తి ఒక ఏడాది పాటు నన్ను నిత్యం పూజించిన ఫలితం పొందుతాడు. దానివల్ల ఆ వ్యక్తికి నిరంతర శుభాలు కలుగుతాయి. చంద్రుడు ఉదయించగానే సముద్రం ఎలా ఉప్పొంగుతుందో, శివరాత్రి రాగానే, శివధర్మం అభివృద్ధి పొందుతుంది. అందువల్ల శివరాత్రి నాడు శివప్రతిష్ఠా కార్యక్రమం, కల్యాణోత్సవాలు జరిపిస్తే, సకల మంగళాలూ లభిస్తాయి.
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అంటేనే యమకింకరులు వణికిపోతారు. ఏకాదశి నాడు : 1) ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలతో, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించినవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. 2) చామంతిపువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించినవాడు మంచిపదవిని పొందుతాడు.

శ్రీ వాసుదేవ శత నామాలు👇


expand_less