March 06 2023మార్చి 06 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 06 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము

తిథి : చతుర్దశి సా. 04గం౹౹11ని౹౹ వరకు తదుపరి  పూర్ణిమ
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం :  మఘ రా. 12గం౹౹06ని౹౹ వరకు తదుపరి  పుబ్బ
యోగం : సుకర్మ  రా. 08గం౹౹55ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :  వణిజ సా. 04గం౹౹17ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹37ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ & మ.02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹52ని౹౹ నుండి 12గం౹౹37ని౹౹
అమృతకాలం : రా. 09గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹12ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹20ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹06ని౹౹కు

గురుబోధ: 
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఎన్ని పనులు ఉన్నా ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడ్ని దర్శించి నమస్కరించాలి. అర్ఘ్యం  ఇవ్వాలి. ఉపనయనం అయిన వారు సంధ్యావందనం చేయాలి. ఉపనయనం కాని వారు లేదా స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ శ్రీ దేవీభాగవతములోని ఈ క్రింది శ్లోకముతో అర్ఘ్యం ఇవ్వవచ్చని శాస్త్రం. 
శ్లో|| యో దేవః సవితాఽస్మాకం ధియో ధర్మాది గోచరాః | ప్రేరయేత్ తస్య యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే!!

expand_less