కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 05 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం
తిథి: దశమి రా. 1.41 కు తదుపరి ఏకాదశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మూల ఉ. 11.24 కు తదుపరి పూర్వాషాఢ
యోగం: సిద్ధి మ. 02.09 కు తదుపరి వ్యతీపాత
కరణం: గరజి ఉ. 08.04 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.54 - 09.41 కు & రా. 11.15 - 00.03 కు
వర్జ్యం: ఉ. 9.48 - 11.24 కు & రా. 8.46 - 10.19 కు
అమృతకాలం: ఉ. 6.10 - 6.39 కు
సూర్యోదయం: ఉ. 6.32 కు
సూర్యాస్తమయం: సా. 6.24 కుగురుబోధ:
బ్రహ్మ, విష్ణువుల ఇద్దరి మధ్య యుద్ధం ఆపడం కోసం మాఘమాసంలో లోకశ్రేయస్సు కోసం ఈశ్వరుడు ఒక అగ్నిస్తంభరూపం ధరించాడు. ఇది శివలింగం అని పిలువబడుతుంది. ఈ లింగమునకు రూపమూ ఉంది. రూపమూ లేదు. ఆకారము ఉంటుంది కాబట్టి లింగం ఇటు సగుణము, నిర్గుణము కూడా. శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు మీ యుద్ధం ఆపడానికి లింగం రూపం ధరించాను, కనుక ఈ కాలమును లింగోద్భవకాలము అని అంటారు. ఈ లింగోద్భవకాలములో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసములో నివసిస్తారు. వారికున్న ఈతి భాధలు తొలగిపోతాయి అని పరమశివుడు వరమిచ్చాడు.
శివరాత్రి మాహాత్మ్యం👇