" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 05 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము తిథి : త్రయోదశి మ. 02గం౹౹06ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : ఆశ్లేష రా. 09గం౹౹38ని౹౹ వరకు తదుపరి మఘ యోగం : అతిగండ రా. 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : తైతుల మ. 02గం౹౹07ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సా. 04గం౹౹32ని౹౹ నుండి 05గం౹౹19ని౹౹ వర్జ్యం : ఉ. 09గం౹౹13ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ అమృతకాలం : రా. 07గం౹౹51ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹21ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹06ని౹౹కు గురుబోధ: పురోహితుడు అంటే సరైన అర్థం - మంచి దారి చూపించేవాడు. పుర: + హితుడు=>పురోహితుడు "పురస్తాత్ హితం ఇచ్చంతి పురోహితాః" పుర: -వెళ్లే మార్గం (ముందు) హితుడు సరైన విధానాన్ని చూపించువాడు. పురోహితుడు* - వెళ్లే మార్గంలో ఆటంకాలు లేకుండా మంచిమార్గం చూపించి రక్షించేవాడని అర్థం.