కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 03 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం
తిథి: అష్టమి 4వ తేదీ తె. 3.25 కు తదుపరి నవమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: అనూరాధ ఉ. 11.18 కు తదుపరి జ్యేష్ఠ
యోగం: హర్షణ సా. 05.25 కు తదుపరి వజ్ర
కరణం: బవ ఉ. 08.44 కు తదుపరి బాలవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.49 - 05.36 కు
వర్జ్యం: సా. 4.58 - 6.35 కు
అమృతకాలం: రా. 2.41 - 4.18 కు
సూర్యోదయం: ఉ. 6.33 కు
సూర్యాస్తమయం: సా. 6.23 కు
👉🕉️ ఆదివారం నాటి అష్టమీతిథి కాలభైరవునికి అత్యంత ప్రీతికరం 🕉️👈
గురుబోధ:
మాఘమాసం ఆదివారం సూర్య ఆరాధన అత్యంత విశేషమైనది.
కాలభైరవుడికి అష్టమి, అమావాస్య, ఆదివారం, బుధవారం కూడా ఇష్టం. అందులో ఆదివారం అష్టమి వచ్చినప్పుడు గాని బుధవారం అష్టమి వచ్చినప్పుడు గాని పూజిస్తే అనేక శక్తులు లభిస్తాయి. అష్టభైరవులలో ఒకరైన క్రోధభైర్వుడు సంప్రీతుడై స్థిరమైన ఉద్యోగం ప్రసాదిస్తాడు. అనారోగ్యాలన్నీ దూరమవుతాయి. అష్టసిద్ధులు మనకి లభించి, మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి.
కాలభైరవాష్టకం 11సార్లు👇శ్రీ మార్కండేయ కృత ఆదిత్య స్తవము👇