" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 03 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము తిథి : ఏకాదశి ఉ. 09గం౹౹55ని౹౹ వరకు తదుపరి ద్వాదశి ( 04) మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ వరకు వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : పునర్వసు సా. 04గం౹౹29ని౹౹ వరకు తదుపరి పుష్యమి యోగం : సౌభాగ్య సా. 06గం౹౹45ని౹౹ వరకు తదుపరి శోభన కరణం : విష్టి ఉ. 09గం౹౹11ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : మ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹43ని౹౹ నుండి 09గం౹౹30ని౹౹ వరకు & మ. 12గం౹౹37ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు వర్జ్యం : రా. 01గం౹౹19ని౹౹ నుండి 03గం౹౹05ని౹౹ వరకు అమృతకాలం : మ. 01గం౹౹50ని౹౹ నుండి 03గం౹౹35ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹21ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹04ని౹౹ కు 🕉️👉ఏకాదశి👈🕉️ ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణము శనివారం మధ్యాహ్నం 12గం.ల. లోపు చేయవచ్చును. గురుబోధ ఏకాదశీ తిథి శ్రీమహావిష్ణు స్వరూపము. లక్ష్మీ నారాయణులను వాసుదేవ శతనామావళితో గాని, విష్ణుసహస్రనామంతో గాని భక్తిశ్రద్ధలతో పూజించినవారు సకలశుభాలు పొందుతారు. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. గురుదర్శనం, గురుస్మరణం వలన సర్వపాపహరణమై హరికటాక్షం సులభంగా లభ్యమవుతుంది.