March 01 2024మార్చి 01 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 01 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం

తిథి: షష్ఠి 2వ తేదీ తె.  3.15 కు తదుపరి సప్తమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: స్వాతి ఉ.  9.17 కు తదుపరి విశాఖ
యోగం: ధ్రువ సా.  06.15 కు తదుపరి వ్యాఘాత
కరణం: గరజి రా.  07.12 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.  08.56 - 09.43 కు& మ.  12.52 - 01.39
వర్జ్యం: మ.  3.10 - 4.51  కు
అమృతకాలం: రా.  1.28 - 3.10 కు
సూర్యోదయం: ఉ.  6.34 కు
సూర్యాస్తమయం: సా.  6.23 కు

గురుబోధ:
స్నానం చేయకుండా వంట వండడం చేయరాదు. అలా వండిన పదార్థాలను తినరాదని శాస్త్రం.  ఎంగిలి చేత్తో పొయ్యి వెలిగించడం, వంట చేయడం కూడా చేయరాదు. 
అగ్నిదేవుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన అనుగ్రహం కలగాలంటే శుచిగా వంట వండాలి. అలా చేస్తే ఇంటిలోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

మంగళ షష్ఠీ లేదా దేవసేనా స్తోత్రం👇


expand_less