March 01 2023మార్చి 01 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 01 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము

తిథి : దశమి పూర్తిగా ఉంది (02వ తేదీ ఉ. 08గం౹౹05ని౹౹ వరకు) తదుపరి ఏకాదశి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం :  మృగశిర మ. 12గం౹౹00ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : ప్రీతి  సా. 05గం౹౹02ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్ 
కరణం :  తైతుల సా. 05గం౹౹26ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹51ని౹౹ నుండి 12గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : రా. 09గం౹౹08ని౹౹ నుండి 10గం౹౹52ని౹౹ వరకు 
అమృతకాలం : తె. 03గం౹౹13ని౹౹ నుండి 04గం౹౹57ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹22ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹03ని౹౹ కు

గురుబోధ* 	
అన్నమును ఎట్టి పరిస్థితుల్లో నిందించరాదు. అదొక వ్రతం. ఉదా౹౹ భోజనం చేస్తుండగా వంట రుచిగా లేకపోవడం వల్ల వండిన పదార్థాలను లేదా వండిన వారిని ప్రత్యక్షంగా నిందించడం చేయరాదు. అది పెద్ద దోషం. ఒకవేళ తప్పక చెప్పదల్చినా భోజనం అయ్యాక వంట సరి చేసుకోమని వారికి చెప్పాలి. ప్రయాణములు చేస్తుండగా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భోజన నియమాలు పాటించడం కుదరకపోవచ్చు. అది పెద్ద దోషం కాదు. 
హిరణ్యకశిపుడు - ప్రహ్లాదుని మీద ఆగ్రహంతో ఆహారంలో విషం కలిపి తినిపించాడు. ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేసి ఆ ఆహారాన్ని  స్వీకరించగా అది అమృతం అయ్యింది. అందుకే భోజనం చేస్తున్నా, ఏది తింటున్నా భగవన్నామం చేసి తినడం వల్ల అవి పవిత్రం అయి ప్రసాదంగా మారుతాయి.


expand_less