March 01 2022మార్చ్ 01 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 01 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం కృష్ణ పక్షము
తిథి: చతుర్దశి రాత్రి 12గం౹౹42ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ధనిష్ఠ తెల్లవారి 03గం౹౹44ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం:  పరిఘ  ఈ రోజు ఉదయం 11గం౹౹18ని౹౹ వరకు తదుపరి శివ
కరణం  : విష్టి   ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹06ని౹౹ వరకు తదుపరి  శకుని
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹41ని౹౹ నుండి 09గం౹౹30ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹46ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 08గం౹౹33ని౹౹ నుండి 10గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం: సాయంత్రం 05గం౹౹45ని౹౹ నుండి 07గం౹౹17ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹22ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹03ని౹౹ వరకు 

👉🏻🕉️మహా శివరాత్రి🕉️

గురుబోధ: 

శివలింగము మాఘమాస కృష్ణ చతుర్దశి అర్థరాత్రి నాడు ఆవిర్భవించాడు. ఆ పర్వదినమును శివరాత్రి అంటారు. అంతటి పర్వదినం నాడు ప్రతి ఒక్కరు తప్పక దీపం వెలిగించడం, శివుని పై పత్రం లేదా పుష్పం పెట్టడం యథాశక్తి అభిషేకం చేయడం చేయాలి.
expand_less