June 30 2025జూన్ 30 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 30 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి మ.1.37 కు తదుపరి ఆషాఢ శుద్ధ షష్ఠి 1 మ.2.08 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మఖ ఉ.10.13 కు తదుపరి పుబ్బ 1 ఉ.11.22 కు
యోగం: సిద్ధ సా.5:20 కు తదుపరి వ్యతీపాత 1 సా.5:18 కు
కరణం: బాలవ ఉ.8.24 కు తదుపరి కౌలవ రా.8.47 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:45-1:37 కు, మ. 3:22-4:14 కు
వర్జ్యం: రా.6.36-8.15 కు
అమృతకాలం: రా.2.05-3.47 కు
సూర్యోదయం: ఉ. 5:32కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు

🕉️ వారాహీ నవరాత్రులు 5వ రోజు, స్కంద పంచమి🕉️

గురుబోధ:
శుక్లపక్షంలో వచ్చే పంచమి సూర్యోదయం వరకు ఉంటే ఆ పంచమిని స్కంద పంచమి అంటారు. కుమారస్వామి, శాఖుడు విశాఖుడు, స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, ఇలా అనేక నామాలతో, అనేక రూపాలతో వెలిసాడు. అందులో స్కందుడు అనే పేరుతో వెలసి కొలువైనటువంటి ఒక ఆలయంలో, విగ్రహరూపం ధరించినటువంటి రోజు ఆషాఢ శుక్ల పంచమి.
ఆచరించవలసిన విధివిధానాలు
ఈ రోజు ఆవుపేడను పిడకలు చేసి కాల్చగా వచ్చిన భస్మంతో రుద్రాభిషేకం చేసి, ఆ విభూతిని శరీరానికి పూసుకొని అప్పుడు కుమారస్వామిని యథాశక్తిగా అర్చించి, చిమ్మిలి (నువ్వులు, బెల్లం కలిపిన ముద్దను) నివేదించి ప్రసాదంగా స్వీకరించిన వారికి జాతక దోషాలు అన్నీ పరిహారం అయిపోతాయి. సకలైశ్వర్యాలు లభిస్తాయి. ఈరోజు షష్ఠీదేవి స్తోత్రమును పారాయణ చేయాలి. ఫలశ్రుతి: పిల్లలు ఆరోగ్యవంతులవుతారు. ఆయువు పెరుగుతుంది. సకల శుభాలు పొందుతారు. సర్పదోషాల నుండి విముక్తి పొందుతారు.

షష్ఠీదేవి స్తోత్రము: https://youtu.be/z5AyoV476mQ?si=uLTFHvgm5povIJrZ
PDF-https://srivaddipartipadmakar.org/stotram/shasti-devi-stotrasridevibhagavatam/

expand_less