"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 30 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : పాడ్యమి ఈ రోజు ఉదయం 08గం౹౹43ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : పునర్వసు ఈ రోజు రాత్రి 11గం౹౹45ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : ధృవ ఈ రోజు ఉదయం 09గం౹౹52ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం : బవ ఉదయం 09గం౹౹49ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹52ని౹౹ నుండి 10గం౹౹44ని౹౹వరకు & మధ్యాహ్నం 03గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹58ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 10గం౹౹26ని౹౹ నుండి12గం౹౹12ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు రాత్రి 09గం౹౹05ని౹౹ నుండి 10గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹32ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ:
వంద పనులు ఉన్నా వేళకు భోజనం చేయాలి. వేయి పనులు ఉన్నా నిద్రలేవగానే ప్రాతఃకాలంలో
స్నానం చేయాలని శాస్త్రం.