కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 29 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి మ.1.40 తదుపరి పంచమి 30 మ.1.37 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఆశ్లేష ఉ.9.39 కు తదుపరి మఖ 30 ఉ.10.13 కు
యోగం: వజ్ర సా.5:58 కు తదుపరి సిద్ధ 30 సా.5:20 కు
కరణం: విష్టి ఉ.8.15 కు తదుపరి బవ రా.8.13 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.5:06-5:58 కు
వర్జ్యం: రా.9.56-11.34 కు
అమృతకాలం: ఉ.8:00-9:36 కు
సూర్యోదయం: ఉ. 5:31కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు
🕉️వారాహీ నవరాత్రులు 4వ రోజు🕉️
గురుబోధ:
లోకశ్రేయస్సు కోసం అమ్మవారు సప్తమాతృకలుగా మారింది, వారిలో ఒక మాతృకే వారాహీదేవి. అది కాక భండాసురుడనే రాక్షసుని వధించడానికి లలితామాతకు సాయం చేసిన స్వరూపమే వారాహీదేవి. శ్రీ వారాహీదేవి ఆషాఢ శుక్ల పాడ్యమీ తిథి నాడు అవతారం ఎత్తారు. తెల్లని రూపములో, యౌవనములో ఉండే ఈ తల్లి, లలితాదేవికి సేనాధిపతి. భూసంబంధ వివాదాల పరిష్కారం గురించి, వ్యాపారాల అభివృద్ధి గురించి అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు అనుగ్రహిస్తుంది. వసుధా స్తోత్రం అమ్మవారికి చాలా ఇష్టమైనది. వీలైనంత జపం/శ్రవణం చేసి తరించగలరు.
వారాహీ కవచం: https://youtu.be/ECa8o_0ig1k?si=4OAb8QAD8iwAfB3i
PDF👉🏻 - https://srivaddipartipadmakar.org/stotram/sri-varahi-kavacham/
వసుధా స్తోత్రం 1000 సార్లు - https://youtu.be/o2fhQPhPJYs?si=evioki6JWXa0ecVT