June 29 2023జూన్ 29 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 29 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము

తిథి : ఏకాదశి రా. 10గం౹౹40ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : స్వాతి మ. 01గం౹౹13ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : సిద్ధ 30వ తేదీ తె. 03గం౹౹44ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :  వణిజ మ. 03గం౹౹06ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹52ని౹౹ నుండి 10గం౹౹44ని౹౹ వరకు & మ. 03గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹58ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 06గం౹౹52ని౹౹ నుండి 08గం౹౹29ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹47ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹32ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు



🕉️తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి లేక ప్రథమైకాదశి🕉️

ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం చేయాలి.

గురుబోధ
ఈ తిథి నాడు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో రెండు రూపాలు ధరించి, ఒక రూపంతో క్షీరసముద్రంలో నిద్రపోతాడు. మరొకరూపంలో పాతాళంలో బలిచక్రవర్తిని అనుగ్రహిస్తాడు. ఈ రెండు రూపాలలో ఉన్న విష్ణువును పూజించాలి. ఈ ఏకాదశి రోజు చేసేటటువంటి పూజ, స్మరణం, దానం, ధర్మం, పురాణశ్రవణం మహాఫలితాలను ఇస్తుంది. 

expand_less