"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 29 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం కృష్ణపక్షము
తిథి : అమావాస్య ఈ రోజు ఉదయం 06గం౹౹42ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : ఆరుద్ర ఈ రోజు రాత్రి 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : వృద్ధి ఈ రోజు ఉదయం 08గం౹౹42ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం : నాగవాన్ ఉదయం 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹37ని౹౹ నుండి 12గం౹౹29ని౹౹వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹02ని౹౹ నుండి 11గం౹౹48ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹32ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ:
నీళ్లను తాగేటప్పుడు పెదవులకు తాకించకుండా చేతితో ఎత్తుకుని త్రాగాలి. పాలు ఇతరపదార్థాలు తీసుకుంటున్నప్పుడు పెదవుల శబ్దం(జుర్రుకుంటూ త్రాగే శబ్దం) రాకుండా తాగాలని శాస్త్రం.