June 28 2025జూన్ 28 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 28 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: తదియ మ.2.05 కు తదుపరి చతుర్థి 29 మ.1.40 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పుష్యమి ఉ.9.24 కు తదుపరి ఆశ్లేష 29 ఉ.9.39 కు
యోగం: హర్షణ సా.7:15 కు తదుపరి వజ్ర 29 సా.5:58 కు
కరణం: గరజి ఉ.7.19 కు తదుపరి వణిజ రా.8.28 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:32-8:25 కు
వర్జ్యం: రా.10.20-11.56 కు
అమృతకాలం: ఉ.7:24-8:58 కు
సూర్యోదయం: ఉ. 5:31కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు

🕉️వారాహీ నవరాత్రులు 3వ రోజు🕉️

గురుబోధ:
సదాచారాలను పాటించేవారు దేవతలకు, పితృదేవతలకు ప్రీతిపాత్రులు అవుతారు. అశౌచకాలంలో సరైన నియమాలను పాటించకపోతే దేవతలు మరియు పితృదేవతల అనుగ్రహము పొందలేము. ఉదా౹౹ మృతాశౌచం ఉన్న రోజులలో లేదా స్త్రీలు బయట ఉన్న రోజులలో అగ్నిని తాకడం, దేవతామూర్తులను, ఇంటిలో అన్ని వస్తువులను తాకడం, వంట చేయడం, అందరినీ కలుపుకోవడం చేయరాదు. ఇటువంటి తప్పులు చేసి ఎన్ని ప్రదక్షిణలు, జపాలు, హోమాలు, దానధర్మాలు చేసినా దేవతల అనుగ్రహం కలుగదు. అందుకే సాధ్యమైనంత వరకు ఆచారములు పాటించాలి. అవే మన పిల్లలని, భవిష్యత్ తరాలని కాపాడుతాయి.

expand_less