" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 28 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము తిథి : దశమి రా. 10గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : చిత్త మ. 12గం౹౹29ని౹౹ వరకు తదుపరి స్వాతి యోగం : పరిఘ ఉ. 06గం౹౹09ని౹౹ వరకు తదుపరి శివ కరణం : తైతుల మ. 03గం౹౹17ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹37ని౹౹ నుండి 12గం౹౹29ని౹౹ వరకు వర్జ్యం : సా. 06గం౹౹15ని౹౹ నుండి 07గం౹౹54ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 05గం౹౹45ని౹౹ నుండి 07గం౹౹26ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹31ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు 🕉️ఆషాఢ శుక్ల దశమి - శాకంభరీ అవతారం🕉️ గురుబోధ ఆషాఢ శుక్ల దశమి పరమ పుణ్య ప్రదం. మనువులు, దేవతలు ఈ మాటే అన్నారు. ఆషాఢ శుక్ల దశమినాడు నదీస్నానం చేసినా, మంత్ర జపం చేసినా, దానాలు, హోమాలు చేసినా స్వర్గ సుఖాలు లభిస్తాయని ప్రత్యేకంగా స్వాయంభువమనువు చెప్పారు. ఆషాఢ మాసంలో శుక్లపక్ష దశమి నాడు అమ్మ శాకంభరిగా అవతరించింది. పూజా విధానం-యథాశక్తిగా అమ్మవారిని శాకంభరిగా పూజించాలి. అవకాశం ఉంటే దానధర్మాలు చెయ్యాలి. పఠించవలసిన స్తోత్రాలు-లలితాసహస్రనామ పారాయణం, శ్రీసూక్తం, దుర్గాసూక్తం వంటివి చదవాలి.