"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 28 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం కృష్ణపక్షము
తిథి : అమావాస్య ఈ రోజు పూర్తిగా ఉంది
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : మృగశిర ఈ రోజు సాయంత్రం 06గం౹౹32ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం : గండ ఈ రోజు ఉదయం 07గం౹౹48ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం : శకుని ఉదయం 05గం౹౹52ని౹౹ వరకు తదుపరి చతుష్పాద
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹56ని౹౹ నుండి 11గం౹౹39ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారి 03గం౹౹56ని౹౹ నుండి 05గం౹౹36ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 08గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹35ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ:
పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఆ ఇంటిలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ బాగుంటుంది. పితృదేవతల అనుగ్రహము కలగాలంటే తప్పక చనిపోయిన తిథి నాడు ఆబ్దికము, ప్రతి అమావాస్య, సంక్రమణ మొ౹౹ రోజులలో తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం, పితృపక్షం లో శ్రాద్ధం పెట్టడం చేయాలి.