" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 27 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము తిథి : నవమి రా. 10గం౹౹31ని౹౹ వరకు తదుపరి దశమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : హస్త ఉ. 11గం౹౹14ని౹౹ వరకు తదుపరి చిత్త యోగం : వరీయాన్ ఉ. 06గం౹౹24ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : బాలవ మ. 02గం౹౹40ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు & రా. 10గం౹౹56ని౹౹ నుండి 11గం౹౹39ని౹౹ వరకు వర్జ్యం : రా. 07గం౹౹39ని౹౹ నుండి 09గం౹౹20ని౹౹ వరకు అమృతకాలం : తె. 05గం౹౹00ని౹౹ నుండి 06గం౹౹31ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹31ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు గురుబోధ లోకశ్రేయస్సు కోసం అమ్మవారు సప్తమాతృకలుగా మారింది. ఆ మాతృకలలో ఒక మాతృక పేరు వారాహి. భండాసురుడనే రాక్షసుని వధించడం కోసం శ్రీ లలితామాతకు వారాహి 9 దినముల పాటు రాక్షసంహారంలో తోడ్పడింది. ఈ పవిత్రనవరాత్రులలో మారేడు ఆకులతో (బిల్వదళాలతో) అమ్మవారిని పూజించాలి. ఈ నవరాత్రులలో కనీసం ఒక క్షణకాలమైనా పూజ్యగురుదేవులు అనుగ్రహించిన మంత్రాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. https://youtu.be/KrZ3Or9t9B4