June 27 2022జూన్ 27 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 27 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠమాసం కృష్ణపక్షము 
 తిథి :  చతుర్దశి  తెల్లవారి 04గం౹౹43ని౹౹ వరకు తదుపరి అమావాస్య 
 వారం : ఇందువారము (సోమవారం)
 నక్షత్రం : రోహిణి ఈ రోజు సాయంత్రం 04గం౹౹06ని౹౹ వరకు తదుపరి మృగశిర 
 యోగం :  శూల  ఈ రోజు ఉదయం 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి గండ
 కరణం  : విష్టి  సాయంత్రం 04గం౹౹38ని౹౹ వరకు తదుపరి శకుని
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹06ని౹౹ 03గం౹౹58ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు ఉదయం 07గం౹౹23ని౹౹నుండి 09గం౹౹07ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹16ని౹౹ నుండి 12గం౹౹01ని౹౹ వరకు
 అమృతకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹36ని౹౹ నుండి 02గం౹౹20ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I


గురుబోధ:

చతుర్దశి, సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన తిథి కనుక ఈ రోజు చేసిన స్త్రోత్రము, పూజ, అభిషేకం విశేష ఫలితం ఇస్తుంది.


expand_less