June 26 2023జూన్ 26 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 26 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము

తిథి : అష్టమి రా. 09గం౹౹42ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : ఉత్తర ఉ. 09గం౹౹30ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : వ్యతీపాత ఉ. 06గం౹౹07ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం :  విష్టి మ. 01గం౹౹19ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు & మ. 03గం౹౹05ని౹౹ నుండి 03గం౹౹57ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 06గం౹౹30ని౹౹ నుండి 08గం౹౹13ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹46ని౹౹ నుండి 05గం౹౹31ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹31ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు

గురుబోధ
అష్టమీతిథి శివునికి, అమ్మవారికి అత్యంత ప్రీతికరం. సోమవారంతో పాటు వచ్చిన అష్టమి మరింత విశేషఫలితాలనిస్తుంది. ఈ పరమపవిత్ర వారాహీ నవరాత్రుల సమయంలో శివపార్వతుల అర్చన, అభిషేకం అనంతశుభాలను ప్రసాదిస్తుంది. ఇటువంటి దివ్యసమయాన్ని అలభ్యయోగమని అంటారు. అంత సులువుగా లభించని ఈ రోజును భవానీశంకరులసేవతో సద్వినియోగపరచుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం, పుణ్యప్రదం.

expand_less