"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 25 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం కృష్ణపక్షము
తిథి : ద్వాదశి ఈ రోజు రాత్రి 01గం౹౹16ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : భరణి ఈ రోజు ఉదయం 11గం౹౹49ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : ధృతి ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : కౌలవ మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 05గం౹౹44ని౹౹ నుండి 07గం౹౹14ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 12గం౹౹53ని౹౹ నుండి 02గం౹౹37ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 06గం౹౹51ని౹౹ నుండి 08గం౹౹30ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయవచ్చును.
గురుబోధ:
మణిద్వీప వర్ణన పారాయణము అంటే శ్రీవేదవ్యాసకృత శ్రీ మద్దేవీభాగవతం లోని (ద్వాదశ స్కంధంలో గల 10, 11,12 అధ్యాయాలు) 283 శ్లోకాల పారాయణము చేస్తేనే సంపూర్ణ ఫలితం వస్తుందని శాస్త్రం.
- శ్రీ దేవీభాగవతము