June 24 2022జూన్ 24 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 24 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠమాసం కృష్ణపక్షము 
 తిథి :  ఏకాదశి ఈ రోజు రాత్రి 12గం౹౹55ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (25)  రాత్రి 01గం౹౹16ని౹౹ వరకు
 వారం : భృగువారము (శుక్రవారం)
 నక్షత్రం : అశ్విని ఈ రోజు ఉదయం 11గం౹౹00ని౹౹ వరకు తదుపరి భరణి 
 యోగం :  సుకర్మ  ఈ రోజు పూర్తిగా ఉంది
 కరణం  : బవ  ఉదయం 10గం౹౹22ని౹౹ వరకు తదుపరి బాలవ
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹07ని౹౹ నుండి 08గం౹౹59ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹28నుండి౹౹01గం౹౹21ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు ఉదయం 06గం౹౹52ని౹౹నుండి 08గం౹౹31ని౹౹ వరకు & రాత్రి 08గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹34ని౹౹ వరకు
 అమృతకాలం : లేదు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం చేయాలి.


గురుబోధ:

కాళీమాత నాలుకను(జిహ్వ) ధ్యానించడం,   తలచుకోవడం, దర్శించడం వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. గొప్ప విద్యావంతులు అవుతారు. తెలివితేటలు పెరుగుతాయి. శ్రీ కాళిదాసు, శ్రీ రామకృష్ణ పరమహంస మొదలైనవారు అమ్మవారి నాలుకను ధ్యానించే గొప్పవారు అయ్యారు.


expand_less