కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 23 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ 24 తె. 4.30 కు తదుపరి తదియ
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాషాఢ సా. 6.22 కు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: బ్రహ్మ మ. 02.27 కు తదుపరి ఐంద్ర
కరణం: తైతుల సా. 04.21 కు తదుపరి గరజి
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 05.08 - 06.01 కు
వర్జ్యం: రా. 2.10 - 3.44 కు
అమృతకాలం: మ. 1.39 - 3.14 కు
సూర్యోదయం: ఉ. 5.43 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు
గురుబోధ:
పిల్లలకు లౌకిక విద్యలతో పాటు బాల్యంలోనే మన ఆచారాలు, పురాణములు, సంగీత సాహిత్య కళలు ఇతర శాస్త్రముల మీద అవగాహన ఉండేట్లు చేయాలి. అవే వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి.