June 23 2023జూన్ 23 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 23 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము

తిథి : పంచమి సా. 04గం౹౹48ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : మఘ తె. 04గం౹౹19ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : వజ్ర తె. 04గం౹౹32ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  బవ ఉ. 06గం౹౹40ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹06ని౹౹ నుండి 08గం౹౹59ని౹౹ వరకు & మ. 12గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు 
వర్జ్యం : మ. 02గం౹౹38ని౹౹ నుండి 04గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹17ని౹౹ నుండి 04గం౹౹03ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹33ని౹౹కు


🕉️స్కంద పంచమి🕉️


గురుబోధ
కుమారస్వామి, శాఖుడు, విశాఖుడు, స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, ఇలా అనేక నామాలతో అనేక రూపాలతో సుబ్రహ్మణ్యుడు వెలసాడు. అందులో స్కందుడు అనే పేరుతో వెలసి కొలువైనటువంటి ఒక ఆలయంలో విగ్రహరూపం ధరించినటువంటి రోజు ఆషాఢ శుక్ల పంచమి.
ఆచరించవలసిన విధివిధానాలు:-
1) ఈ రోజు వీలైనంత వరకు స్కందుడు అనే పేరుతో కుమారస్వామిని షోడశోపచారములతో పూజించాలి.  నైవేద్యాలు:- చిమ్మిలి, అనగా నువ్వు పప్పు, బెల్లం బాగా దంచినటువంటి ముద్దని చిమ్మిలి అంటారు.
2) చలివిడి, పానకం కుమారస్వామి వారికి యథాశక్తిన పూజ చేసి నివేదన  చేసి ఆ ప్రసాదం తాము తిని, ఇతరులకు పెట్టాలి.
3) ఈ రోజు షష్ఠీదేవి స్తోత్రమును పారాయణ చేయాలి.
ఫలశ్రుతి:- పిల్లలు ఆరోగ్యవంతులవుతారు, ఆయువు పెరుగుతుంది, సకల శుభాలు పొందుతారు. సర్పదోషాల నుండి విముక్తి పొందుతారు.

https://youtu.be/z5AyoV476mQ

expand_less