కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 22 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి రా.1.00 కు తదుపరి త్రయోదశి 23 రా.10.26 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: భరణి మ.3.54 కు తదుపరి కృత్తిక 23 మ.2.16 కు
యోగం: సుకర్మ సా.4:57 కు తదుపరి ధృతి 23 సా.1:17 కు
కరణం: కౌలవ మ.2.56 కు తదుపరి తైతుల రా 1.22 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.5:04-5:56 కు
వర్జ్యం: రా.3.05-4.35 కు
అమృతకాలం: మ.01.16-02.44 కు
సూర్యోదయం: ఉ. 5:30కు
సూర్యాస్తమయం: సా. 6:32 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈరోజు చెయ్యాలి.
గురుబోధ:
పురాణశ్రవణము, యాత్రా ఫలితం, మనం చేసే దాన ధర్మములు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి. పురాణములు వినడానికి ఎటువంటి నియమం లేదు. శ్రద్ధ, భక్తి ఉంటే చాలు. తింటూ, పనిచేస్తూ, భోజనం చేస్తూ, ప్రయాణం చేస్తూ కూడా వినవచ్చు. ఇంతకంటే తరించే సులభోపాయం మరొకటి లేదు.