కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 22 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ ఉ. 6.33 కు తదుపరి విదియ
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మూల రా. 6.36 కు తదుపరి పూర్వాషాఢ
యోగం: శుక్ల సా. 04.45 కు తదుపరి బ్రహ్మ
కరణం: బవ తె. 06.37 కు తదుపరి బాలవ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.43 - 07.29 కు
వర్జ్యం: తె. 4.06 - 5.41 కు & సా. 4.59 - 6.36 కు
అమృతకాలం: మ. 12.09 - 1.46 కు
సూర్యోదయం: ఉ. 5.43 కు
సూర్యాస్తమయం: సా. 6.53 కు
గురుబోధ:
ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా సంకర్షణుడే, ఎందుకంటే మనము నేడు ఒక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినా రేపు ఈ జన్మ ముగిసాక వేరొక తల్లి గర్భం నుంచి మళ్ళీ తిరిగి జన్మించవచ్చు. కానీ భగవంతుడు స్వేచ్ఛగా అవతారాన్ని స్వీకరించి జన్మిస్తున్నాడు, మానవులు మాత్రం స్వేచ్ఛా విహీనములమై జన్మిస్తాము. కలియుగంలో జన్మించే మానవులు సంకర్షణ! సంకర్షణ! సంకర్షణ! అని నిరంతరం జపించినవారు, వశిష్ఠాది మహామునుల వలె స్వేచ్ఛాజీవులై జన్మించే ఉచ్ఛస్థితికి చేరుకుంటారు లేదా అసలు శరీరమే ధరించకుండా ఉండగలుగుతారు. అంతేకాకుండా సంకర్షణోపాసన చేస్తే, దధీచి వంటి మహాత్ముల వలె మన శరీరాన్ని కావలసినప్పుడు త్యాగము చేయగలుగుతాము. ఈ సంకర్షణోపాసనకి అధిష్ఠాన దేవతే మూడు చుట్లు చుట్టుకుని ఉండే ఆదిశేషుడు. ఆదిశేషుడు తెల్లని స్వరూపముతో, వేయిపడగలతో, ఆ పడగలపై అనేకమైన మణులతో దర్శనమిస్తాడు. ఆ మణులు మనని ఎంతో ఆకర్షిస్తాయి, ఇక్కడే మనము ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి ఆ మణుల యొక్క ఆకర్షణకు లోను కాకుండా ఉండాలి.