" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 22 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము తిథి : చతుర్థి మ. 02గం౹౹47ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : ఆశ్లేష రా. 02గం౹౹19ని౹౹ వరకు తదుపరి మఘ యోగం : హర్షణ తె. 03గం౹౹32ని౹౹ వరకు తదుపరి వజ్ర కరణం : విష్టి సా. 05గం౹౹27ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹43ని౹౹ వరకు & మ. 03గం౹౹05ని౹౹ నుండి 03గం౹౹57ని౹౹ వరకు వర్జ్యం : మ. 01గం౹౹53ని౹౹ నుండి 03గం౹౹39ని౹౹ వరకు అమృతకాలం : రా. 12గం౹౹32ని౹౹ నుండి 02గం౹౹18ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹33ని౹౹కు https://www.youtube.com/watch?v=By5udxRz2AI&list=PLfgDt5ZsV1JJekFsopEXyHLNKbtAaRJzS&pp=iAQB గురుబోధ పురీ క్షేత్రమును నీలాచలక్షేత్రం అని కూడా అంటారు. కలియుగంలో ఈ పర్వతంపై అడుగుపెడితే మహాపాపాలుపోయి, ఏదో ఒక జన్మలో వారణాసిలో మరణించే అదృష్టం లభిస్తుంది. క్షేతానికి 4 ద్వారాలుంటాయి. సింహ, గజద్వారాల ప్రవేశం అత్యధికఫలం. మధ్యాహ్నం 12లోపు స్నానం, అవభృతస్నానఫలం ఇస్తుంది. క్షేత్రంలో దిగగానే నమస్కరిస్తే తక్షణమే భూదేవి అనుగ్రహం కల్గుతుంది. భూదేవి స్తనములలో ఒకటి జగన్నాథపురం, రెండవది బదరి.