కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 21 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: దశమి ఉ.5.44 తదుపరి ఏకాదశి రా.3.17 కు తదుపరి ద్వాదశి 22 రా.1.00 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: అశ్వని సా.5.35 కు తదుపరి భరణి 22 మ.3.54 కు
యోగం: అతిగండ సా.8:28 కు తదుపరి సుకర్మ 22 సా.4:57 కు
కరణం: విష్టి ఉ. 7.19 కు తదుపరి బవ సా.5.55 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:31-8:23 కు
వర్జ్యం: మ.1.51-3.21 & రా.2.31-4.01 కు
అమృతకాలం: మ.01:12-02:41 కు
సూర్యోదయం: ఉ. 5:30కు
సూర్యాస్తమయం: సా. 6:32 కు
🕉️జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి (అపర ఏకాదశి)🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి, ఆదివారం కాదు. ద్వాదశీ పారణము ఆదివారం చెయ్యాలి.
గురుబోధ:
🕉️ ఈరోజు నారాయణుడిని లక్ష్మీదేవితో కలిపి పూజించాలి.
🕉️ లక్ష్మీదేవికి అపర అని పేరు. అపర అనగా భూలోక సుఖములు, పైలోక సుఖములు ఇచ్చునది, అంతకంటే ఉత్తమమైన జగన్మాత మరొకటి లేదు.
🕉️ మందార పుష్పములతో అపరాదేవిని పూజిస్తే అటువంటి వారికి సంపదలు లభిస్తాయి, మల్లె పువ్వుల వంటి తెల్లని పువ్వులతో పూజిస్తే గొప్ప జ్ఞానం కలుగుతుంది, చామంతి పువ్వులతో లక్ష్మీనారాయణ అష్టోత్తరములతో పూజించినవారికి భూసంపద, గృహ సంపద, అన్ని సంపదలు కలుగుతాయి.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
పూజ్య గురువులు అభినవశుక, శ్రీ ప్రణవపీఠాధీశులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే - సంపూర్ణ పద్మపురాణం ప్రవచనం శనివారము మరియు ఆదివారం ఉదయం, సాయంత్రం రెండు పూటలా కార్యక్రమాలు, ప్రవచనములు ఉంటాయి.*
🕉️రేపు ఉదయం 10 గంటలకు ప్రవచనం ఉంటుంది.
🕉️రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ కృష్ణ దేవాలయం లో లక్ష్మీనారాయణ హోమం జరుగుతుంది.
🕉️రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రవచనం ఉంటుంది.