కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 21 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి ఉ. 6.47 కు తదుపరి పూర్ణిమ
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా. 6.22 కు తదుపరి మూల
యోగం: శుభ సా. 06.42 కు తదుపరి శుక్ల
కరణం: వణిజ ఉ. 07.31 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.21 - 09.14 కు & మ. 12.44 - 01.37 కు
వర్జ్యం: రా. 2.26 - 4.03 కు
అమృతకాలం: ఉ. 9.18 - 10.56 కు
సూర్యోదయం: ఉ. 5.43 కు
సూర్యాస్తమయం: సా. 6.53 కు
🕉️ జ్యేష్ఠ పూర్ణిమ🕉️
గురుబోధ:
ఈ తిథిని వటసావిత్రీతిథి అని అంటారు. ఈ తిథి చాలా గొప్పది, పుణ్యతిథి. కాశీలో వటసావిత్రి అని ఒక దేవత, యమరాజేశ్వరలింగానికి దగ్గరలో ఉన్నది. ఈ రోజున ఆ దేవతకి పూజ చేస్తారు. కాశీలో యమధర్మరాజు చేత ప్రతిష్ఠించబడిన లింగం యమరాజేశ్వరలింగం అని పిలవబడుతున్నది. ఈ రోజున మన ఇంట్లో మఱ్ఱిచెట్టు కింద కానీ, లేక మఱ్ఱిఆకు మీద కానీ, ఈ అమ్మవారిని కానీ గాయత్రీదేవిని కానీ పెట్టుకుని పూజ చేయాలి. పూజ చెయ్యలేకపోయినా త్రికాలాలలో అనగా ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు చేతిలోకి నీళ్ళు తీసుకుని తర్పణాలు వదలాలి. అలా వదిలేటప్పుడు “ఓం సావిత్రీం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి” అని వదలండి. ఇలా చేసి పుణ్యం పొందండి.
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు కవయిత్రి శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)