" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 21 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము తిథి : తదియ మ. 12గం౹౹51ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : పుష్యమి రా. 11గం౹౹41ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష యోగం : వ్యాఘాత రా. 02గం౹౹35ని౹౹ వరకు తదుపరి హర్షణ కరణం : గరజి మ. 03గం౹౹09ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹36ని౹౹ నుండి 12గం౹౹28ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 06గం౹౹03ని౹౹ నుండి 07గం౹౹48ని౹౹ వరకు అమృతకాలం : సా. 04గం౹౹38ని౹౹ నుండి 06గం౹౹23ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹33ని౹౹కు https://www.youtube.com/watch?v=By5udxRz2AI&list=PLfgDt5ZsV1JJekFsopEXyHLNKbtAaRJzS&pp=iAQB గురుబోధ పురీ జగన్నాథ క్షేత్రానికి బ్రహ్మదేవుడు ఏకాదశనామాలు పెట్టాడు. అవి చదివి పడుకుంటే దుఃస్వప్నం సుస్వప్నం అవుతుంది, భయంకర జాతకదోషాలుపోతాయి, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి, భక్తితో తలిస్తే ఏ కష్టాలుండవు. 1) ఉచ్చిష్ట జగన్నాథాయనమః 2) శ్రీ క్షేత్ర జగన్నాథాయనమః 3) శంఖ క్షేత్ర జగన్నాథాయనమః 4) పురుషోత్తమ క్షేత్ర జగన్నాథాయనమః 5) నీలాద్రి జగన్నాథాయనమః 6) ఓడ్యాణ పీఠ జగన్నాథాయనమః 7)మత్స్య వైకుంఠ జగన్నాథాయనమః 8)యవనికాతీర్థ జగన్నాథాయనమః 9) కుశస్థలీ జగన్నాథాయనమః 10) పురీక్షేత్ర జగన్నాథాయనమః 11) శ్రీ జగన్నాథ జగన్నాథాయనమః