June 20 2023జూన్ 20 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 20 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము

తిథి : విదియ ఉ. 11గం౹౹09ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : పునర్వసు రా. 09గం౹౹15ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : ధృవ రా. 01గం౹౹48ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  కౌలవ మ. 01గం౹౹07ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹15ని౹౹ నుండి 08గం౹౹59ని౹౹ వరకు & రా. 10గం౹౹54ని౹౹ నుండి 11గం౹౹37ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 08గం౹౹07ని౹౹ నుండి 09గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం : రా. 06గం౹౹37ని౹౹ నుండి 08గం౹౹22ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹32ని౹౹కు

🕉️జగన్నాధ పురి రథయాత్ర🕉️

https://www.youtube.com/watch?v=By5udxRz2AI&list=PLfgDt5ZsV1JJekFsopEXyHLNKbtAaRJzS&pp=iAQB

గురుబోధ
అత్యద్భుతమైన జగన్నాథ ఆలయం ఇంద్రద్యుమ్న మహారాజు సంకల్పబలం వల్ల ఏర్పడింది. గజేంద్రమోక్షంలో గజరాజుగా ఉన్నది ఇంద్రద్యుమ్న మహారాజే. ఆయన్ని అనుగ్రహించి జగన్నాథపురం అనే ఒక ఊరును మహానుభావుడు శ్రీమన్నారాయణుడు పూర్వ సముద్రంలో ఏర్పాటు చేసి అక్కడ జగన్నాథుడయ్యాడు. జగన్నాథుడు సుభద్ర, బలరాముడి తో కొలువై ఉంటాడు.
నేడు ఆచరించవలసిన విధివిధానాలు:
1) ఏదైనా ఒక ఆలయంలో కానీ లేదా మహానుభావులుండే స్థలానికి కానీ వెళ్లి చీపురుకట్ట పట్టుకొని తుడవాలి. నేలని శుభ్రం చెయ్యాలి.
2) గురుసేవ , మహాత్ముల సేవ , ఆలయసేవ , సేవకుడి లాగా దాసుడి లాగా , ఒక కింకరుడి లాగా చెయ్యాలి.
ఫలశ్రుతి:- ఇలా చేసినవారు మహా ఐశ్వర్య సంపన్నులవుతారు.


expand_less