June 19 2024జూన్ 19 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 19 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి పూర్తిగా ఉంది
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: విశాఖ సా. 4.23 కు తదుపరి అనూరాధ
యోగం: సిద్ధ రా. 09.12 కు తదుపరి సాధ్య
కరణం: బాలవ ఉ. 07.28 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.51 - 12.44 కు
వర్జ్యం: రా. 8.35 - 10.16 కు
అమృతకాలం: ఉ. 6.57 - 8.39 కు
సూర్యోదయం: ఉ. 5.43 కు
సూర్యాస్తమయం: సా. 6.53 కు

👉🕉️నమ్మాళ్వార్ తిరునక్షత్రం, కంచి గరుడ ఉత్సవం, జ్యేష్ఠ శుక్ల త్రయోదశి🕉️👈

గురుబోధ
శ్లో|| అదాన దోషేణ భవేత్ దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపమ్ |
పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రః పునరేవ పాపీ ||
దానం చేయని దోషం వల్ల మానవుడు దరిద్రుడై జన్మిస్తాడు. ఈనాటి మన దారిద్ర్యానికి మూలకారణం ఏనాడూ ఎవరికీ దానం చేయకపోవడమే. దరిద్రత వల్ల బ్రతకడానికి ఏదో ఒక పాపం చెయ్యక తప్పదు. పాపం వల్లఈ నరకం తప్పదు. నరకం నుండి తిరిగి భూలోకంలో దరిద్రుడిగా పుడతాడు జీవి. మరల పాపపు బ్రతుకు తప్పదు. ఈ చక్రం నుండి విముక్తి పొందడానికి గురుకటాక్షం కావలసిందే. జ్యేష్ఠమాసంలోని శుక్ల త్రయోదశీ తిథిని దౌర్భాగ్యశమనతిథి అంటారు. ఈ రోజు ఏదైనా నదిలో కాని, ప్రవాహ జలంలో కాని స్నానం చేసి తెల్లమందారం, జిల్లేడు, ఎఱ్ఱగన్నేరు పూలను ఒక పళ్ళెంలో ఉంచాలి. ఆపై సూర్యుని కేసి చూస్తూ పూలను తాకి నమస్కరించాలి. ఈ క్రింది శ్లోకం పఠించాలి.
శ్లో|| మందార కరవీరార్కః భవంతో భాస్కరాంశజాః |
పూజితా మమదౌర్భాగ్యం, నాశయంతు నమోస్తువః ||
"మందారమా! గన్నేరుపూవా! జిల్లేడుపూవా! మీరు సూర్యుని అంశతో జన్మించారు. మా పూజలందుకొని మా దౌర్భాగ్యం తొలగించండి. మీకు నమస్కారం" అని ఈ శ్లోకానికి అర్థం. ఇలా పూజించిన వారి దౌర్భాగ్యాలన్నీ తొలగిపోతాయి. సంపదలు, మనీషాసంపదలు లభిస్తాయి. మనం చేసే దానధర్మములు, పురాణశ్రవణము, తీర్థయాత్రాఫలితాలు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి.

expand_less