June 19 2023జూన్ 19 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 19 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము

తిథి : పాడ్యమి ఉ. 09గం౹౹31ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : ఆర్ద్ర రా. 06గం౹౹59ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : వృద్ధి రా. 01గం౹౹15ని౹౹ వరకు తదుపరి ధృవ
కరణం :  బవ ఉ. 11గం౹౹25ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹19ని౹౹ వరకు & మ. 03గం౹౹04ని౹౹ నుండి 03గం౹౹56ని౹౹ వరకు 
వర్జ్యం : లేదు
అమృతకాలం : ఉ. 08గం౹౹19ని౹౹ నుండి 10గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹32ని౹౹కు

🕉️ఆషాఢ శుద్ధ పాడ్యమి - వారాహీ నవరాత్రులు ప్రారంభం🕉️

https://youtu.be/KrZ3Or9t9B4

https://www.youtube.com/watch?v=By5udxRz2AI&list=PLfgDt5ZsV1JJekFsopEXyHLNKbtAaRJzS&pp=iAQB

గురుబోధ
షోడశకళాప్రపూర్ణుడైన జగన్నాథుని రథం 45 అడుగులు, 16 కొయ్యచక్రాలతో ఉంటుంది. రథంపై పసుపురంగు జెండాకు నందిఘోష అని పేరు, దానిపై గరుత్మండుడు ఉంటాడు. బలభద్రరథం 44 అడుగులుతో ఉండి 14 చక్రాలుంటాయి. రథంపై నీలి, ఆకుపచ్చరంగు జెండాపై తాటిచెట్టు ఉంటుంది, దీనిని కల్పధ్వజం అంటారు. సుభద్ర (లక్ష్మీదేవి అంశే) పసుపురథం 43 అడుగులు, 12 చక్రాలతో నల్లజెండాపై పద్మము ఉంటుంది. ఈ విశేషాలు విన్నా దుఃస్వప్నాలు రావు, పాపాలు తొలగుతాయి. మొదట రథోత్సవంలో బలభద్ర, సుభద్రా రథాలు, లక్ష్మీసహిత జగన్నాథుడు‌ రథం పై ఉండగా దేవతలు, బ్రహ్మ, శివుడు, వాసుకిని కట్టి లాగారు. - శ్రీ స్కాందపురాణం


expand_less