కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 18 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి రా.12.09 కు తదుపరి పంచమి 19 రా.10.25 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పుష్యమి సా.4.43 కు తదుపరి ఆశ్లేష 19 సా.3.39 కు
యోగం: హర్షణ మ.2:53 కు తదుపరి వజ్ర 19 మ.12:48 కు
కరణం: విష్టి రా.6:59 కు తదుపరి బాలవ 19 సా.5:00 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.06 - 10.59 కు, మ. 3.19 - 4.11 కు
వర్జ్యం: తె.4.57 - 19 ఉ.6.28 కు
అమృతకాలం: తె. 05.40 - 07.08 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.48 కు
గురుబోధ:
ప్రతిరోజూ ఇంట్లో పూజ చేయడంతో పాటు గుడికి కూడా వెళ్ళాలి. భగవంతుని అనుగ్రహం 100 మార్కులు అనుకుంటే, ఇంట్లో చేసే పూజ వల్ల 5 మార్కులు, గురువిచ్చిన మంత్రం అనుష్ఠానం చేయడం వల్ల 45 మార్కులు, గుడికి వెళితే 40 మార్కులు, యజ్ఞములు చేసినా, చూసినా, అందుకు సాయం చేసినా 10 మార్కులు, ఇలా అన్నీ చేస్తేనే 100 మార్కులు. కాబట్టి భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందాలంటే తనకు గురువిచ్చిన మంత్రానుష్ఠానం, దేవాలయానికి వెళ్ళడం, ఇంట్లో పూజ, యజ్ఞములను చేయడం లేదా చేయించడం వంటి నాలుగు ప్రక్రియలు తప్పక మానవుడు పాటించాలి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial