కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 18 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి 19 తె. 5.43 కు తదుపరి త్రయోదశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: స్వాతి మ. 2.41 కు తదుపరి విశాఖ
యోగం: శివ రా. 09.39 కు తదుపరి సిద్ధ
కరణం: విష్టి తె. 06.24 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.20 - 09.13 కు & రా. 11.13 - 11.56 కు
వర్జ్యం: రా. 8.40 - 10.23 కు
అమృతకాలం: ఉ. 6.51 కు
సూర్యోదయం: ఉ. 5.42 కు
సూర్యాస్తమయం: సా. 6.53 కు
👉🕉️జ్యేష్ఠ శుక్ల ద్వాదశి (రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి, ఆదిశంకరుల కైలాస గమనం)🕉️👈
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈరోజు చెయ్యాలి.
గురుబోధ
జ్యేష్ఠమాసంలో శుక్ల పక్షంలో నిర్జల ఏకాదశి తరువాత రోజు అనగా ద్వాదశీ తిథిని రామలక్ష్మణ ద్వాదశి అని అంటారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఒక్క పండు అయినా తగిన దక్షిణతో దానం చేయాలి. భక్తి శ్రద్ధలతో “రామలక్ష్మణ అర్పణమస్తు, రామలక్ష్మణ అర్పణమస్తు, రామలక్ష్మణ అర్పణమస్తు” అంటూ దానం చేయాలి. అది రామలక్ష్మణులకి చేరుతుంది. వారు స్వయంగా స్వీకరిస్తారు. దాని వలన మనకి ఉన్న సమస్త పాపాలు తొలగిపోయి జీవితం అంతా సఫలం అవుతుంది, సర్వశుభాలు కలుగుతాయి అని రాములవారు వివరించారు. రామలక్ష్మణులు తమ అవతారపరిసమాప్తి వరకు ప్రతి జ్యేష్ఠశుక్లపక్ష ద్వాదశి రోజు దానం చేసారు. అందువలన ఈ తిథిని రామలక్ష్మణ ద్వాదశీ తిథి అని అంటారు. షణ్మత స్థాపనాచార్యులైన జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు కైలాస గమనం చేసిన రోజు కూడా ఇదే కావడం వలన వారి స్మరణ, పూజాదులు గురు కటాక్షాన్ని ప్రసాదిస్తాయి.
https://youtu.be/lb-Cfa7YoEQ
https://srivaddipartipadmakar.org/stotram/sri-sankaracharya-astothra-sethanamavali/pcatid/108/
https://youtu.be/YlxIZosSc7Q