June 18 2023జూన్ 18 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 18 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : అమావాస్య ఉ. 08గం౹౹54ని౹౹ వరకు తదుపరి ఆషాఢ శుద్ధ పాడ్యమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : మృగశిర సా. 05గం౹౹25ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : గండ రా. 01గం౹౹00ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం :  నాగ ఉ. 10గం౹౹06ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹48ని౹౹ నుండి 05గం౹౹41ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 02గం౹౹21ని౹౹ నుండి 04గం౹౹03ని౹౹ వరకు 
అమృతకాలం : ఉ. 08గం౹౹09ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹32ని౹౹కు


గురుబోధ
భూలోకంలో ఉన్న వారికి పగలు, రాత్రి కలిస్తే ఒక  రోజు అంటారు. దేవతలకు ఉత్తరాయణం, దక్షిణాయనం  కలిపితే ఒక రోజు (అంటే మనకు ఒక సంవత్సరం). పితృదేవతలకు శుక్ల పక్షము, కృష్ణ పక్షము కలిస్తే ఒక రోజు (మనకు 30 రోజులు). అందుకే ప్రతి నెల అమావాస్య నాడు వారికి తప్పక తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం చేయాలి. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.

expand_less