కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 17 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి 18 తె. 4.23 కు తదుపరి ద్వాదశి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: చిత్త మ 12.35 కు తదుపరి స్వాతి
యోగం: పరిఘ రా. 09.35 కు తదుపరి శివ
కరణం: వణిజ సా. 05.38 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.44 - 01.36 కు & మ. 03.22 - 04.14 కు
వర్జ్యం: సా. 6.40 - 8.24 కు
అమృతకాలం: తె. 5.07 - 7.19 కు
సూర్యోదయం: ఉ. 5.42 కు
సూర్యాస్తమయం: సా. 6.52 కు
👉🕉️ జ్యేష్ఠ శుక్ల ఏకాదశి - నిర్జల ఏకాదశి 🕉️👈
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చెయ్యాలి.
గురుబోధ:
ఏకాదశికి హరివాసరమని పేరు, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి. జ్యేష్ఠ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు, యథాశక్తి దానాలు చేసుకున్నవారు నారాయణుని అర్చన చేసినవారు తిరుగులేని శుభఫలితాలు పొందుతారు. లక్ష్మీనారాయణులను అష్టోత్తరశతనామాలతో పూజించాలి. తులసీదళములతో పూజిస్తే ఆరోగ్యము, బిల్వపత్రాలతో పూజిస్తే సంపదలు లభిస్తాయి. ఈ రోజు శివలింగానికి పంచామృతాలతో, శంఖజలంతో అభిషేకించి, బిల్వపత్రాలు, తులసీదళాలతో పూజించాలి. ఏకాదశినాడు గురువులకు ప్రదక్షిణ చేసినవారు సాక్షాత్ వైకుంఠంలో నారాయణునికి ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారని పద్మపురాణం చెపుతోంది. ఒంట్లో ఓపికనుబట్టి ఫలహారం లఘువుగా స్వీకరించి, ఉపవసించి ఏకాదశీవ్రతమును ఆచరించి యథాశక్తి దానధర్మాలు చేసుకున్నవారు గురుకటాక్షం, హరికటాక్షం అక్షయంగా పొందుతారు.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial