June 17 2023జూన్ 17 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 17 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్దశి ఉ. 08గం౹౹30ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : రోహిణి సా. 04గం౹౹11ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : శూల రా. 01గం౹౹23ని౹౹ వరకు తదుపరి గండ
కరణం :  శకుని ఉ. 09గం౹౹11ని౹౹ వరకు తదుపరి చతుష్పాద
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹29ని౹౹ నుండి 07గం౹౹13ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 07గం౹౹55ని౹౹ నుండి 09గం౹౹34ని౹౹ వరకు & రా. 10గం౹౹04ని౹౹ నుండి 11గం౹౹45ని౹౹ వరకు 
అమృతకాలం : మ. 12గం౹౹52ని౹౹ నుండి 02గం౹౹31ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹31ని౹౹కు


గురుబోధ
సదాచారాలను పాటించేవారు దేవతలకు, పితృదేవతలకు ప్రీతిపాత్రులు అవుతారు. అశౌచ కాలంలో సరైన నియమాలను పాటించకపోతే దేవతలు మరియు పితృదేవతల అనుగ్రహము పొందలేము. ఉదా౹౹  మృతాశౌచం ఉన్న రోజులలో (10, 12 లేదా 15 రోజులు) లేదా స్త్రీలు బయట ఉన్న 3 రోజులు  అగ్నిని తాకడం, దేవతా మూర్తులను, ఇంటిలో అన్ని వస్తువులను తాకడం, వంట చేయడం, అందరినీ కలుపుకోవడం చేయరాదు. ఇటువంటి తప్పులు చేసి ఎన్ని ప్రదక్షిణలు, జపాలు, హోమాలు, దానధర్మాలు చేసినా దేవతల అనుగ్రహం కలుగదు. అందుకే సాధ్యమైనంత వరకు ఆచారములు పాటించాలి. అవే మన పిల్లలని,  భవిష్యత్ తరాలని కాపాడుతాయి.

expand_less