కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 16 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: శు.పాడ్యమి 16 ఉ.6.44 కు తదుపరి విదియ 17 తె.4.22 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఆర్ద్ర రా.7.30 కు తదుపరి పునర్వసు 17 సా.6.00 కు
యోగం: వృద్ధి రా.12:34 కు తదుపరి ధ్రువ 17 రా.8:50 కు
కరణం: బాలవ మ.2:39 కు తదుపరి తైతుల 17 ఉ.11:12 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.22 - 9.14 కు, రా. 11.11 - 11.54 కు
వర్జ్యం: రా.2.54-4.20 కు
అమృతకాలం: ఉ. 07.40 - 09.04 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు
గురుబోధ:
శ్లో|| కరవీర! వృషావాస! నమస్తే భానువల్లభ!
దంభోళి మృడ దుర్గాది దేవానాం సతతం ప్రియం!
జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నాడు దేవాలయ సంబంధమైన ప్రాంతంలో పూచిన గన్నేరు పువ్వును గంధం, కుంకుమ జల్లి భక్తితో నమస్కరించి ఈ పై శ్లోకం చదువుకోవాలి. ఇలా పలికి, ఆ పుష్పాన్ని ఆ ప్రాంగణమునకు చెందిన అర్చకులకు లేక పురోహితులకు దానం చెయ్యాలి. ఇలా చేసిన వారికి అద్భుతమైన ఆధ్యాత్మికజ్ఞానం, జ్ఞాపకశక్తి లభిస్తాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial