కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 16 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి మ.3.10 కు తదుపరి షష్ఠి 17 మ.1.56 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ధనిష్ఠ రా.11.34 కు తదుపరి శతభిషం 17 రా.10.57 కు
యోగం: వైధృతి ఉ.11:06 కు తదుపరి విష్కంభ 17 ఉ.8:34 కు
కరణం: తైతుల మ.3.32 కు తదుపరి గరజి రా 3.12 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:42-1:34 కు, మ. 3:19-4:11 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.02:43-04:20 కు
సూర్యోదయం: ఉ. 5:28 కు
సూర్యాస్తమయం: సా. 6:30 కు
గురుబోధ:
అన్నం వండేటప్పుడు తప్పక భగవన్నామం లేదా పురాణకథలు వింటూ చేయాలి. అప్పుడు తినే అన్నం అమృతతుల్యం అవుతుంది. మానసిక, శారీరిక అనారోగ్యాన్ని తొలగిస్తుంది. అన్నం వండేవారు ఏ ఆలోచనలతో వండారో ఆ ఆలోచనలు అన్నం తిన్నవారి మీద ప్రభావం చూపుతాయి. అందుకే మన పెద్దలు ఆచారముల మీద మక్కువ కలిగినవారు సాధ్యమైనంతవరకు బయట వండిన పదార్థాలను తినడానికి ఇష్టపడరు.