కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 16 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: దశమి రా. 2.44 కు తదుపరి ఏకాదశి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: హస్త ఉ. 10.09 కు తదుపరి చిత్త
యోగం: వరీయాన్ రా. 09.03 కు తదుపరి పరిఘ
కరణం: తైతుల మ. 03.41 కు తదుపరి గరజి
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 05.07 - 05.59 కు
వర్జ్యం: సా. 6.57 - 8.43 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5.42 కు
సూర్యాస్తమయం: సా. 6.52 కు
గురుబోధ:
జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమీతిథిని దశపాపహర తిథి అని అంటారు. మనం చేసేటువంటి పాపాలు దశ విధాలు. ఆ దశ పాపములు మూడు రకాలు, అవి: 1.కాయక పాపాలు 2.వాచక పాపాలు 3.మానసిక పాపాలు. మనం శరీరంతో చేసే, మాటలతో చేసే, మనస్సుతో చేసే పాపాలు మొత్తం 10 (కాయక పాపాలు-3, వాచక పాపాలు-3, మానసిక పాపాలు-4) ఇటువంటి దశపాపాలు తొలగించే తిథి దశపాపహర తిథి, ఈ రోజు చేయవలసిన విధి విధానాలు :
1. గంగాస్నానం, ఆపకుండా గోవింద నామస్మరణ. కాశీకి వెళ్లే అవకాశం లేని వాళ్లు ఉన్నచోటనే ఎవరి ఇంట్లో వాళ్లు, ఎవరికి వాళ్లు స్నానం ఆచరించినప్పుడు నీళ్ళలో చేతిని త్రిప్పుతూ గంగ, గంగ, గంగ అని మూడుసార్లు భక్తితో సంకల్పం చేసుకొని స్నానం ఆచరించాలి. తలచుకున్న మాత్రమునే పాపములను హరించే శక్తి గంగకి ఉంటుంది. అందువలన గంగని ఆహ్వానించి స్నానం ఆచరిస్తే గంగాస్నాన ఫలితం ఉంటుంది.
2. శ్రీమన్నారాయణుడిని అష్టోత్తర శతనామావాళితో కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతూ గాని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. యథాశక్తి దానధర్మాలు చేయడం సకల పాపహరం.
3. అవకాశం ఉన్నవాళ్లు పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం నక్షత్రదర్శనం చేసుకుని భోజనం చేస్తే చాలా మంచిది.