June 16 2023జూన్ 16 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 16 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : త్రయోదశి ఉ. 08గం౹౹36ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : కృత్తిక మ. 03గం౹౹24ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : ధృతి రా. 01గం౹౹23ని౹౹ వరకు తదుపరి శూల
కరణం :  వణిజ ఉ. 08గం౹౹39ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹05ని౹౹ నుండి 08గం౹౹58ని౹౹ వరకు & మ. 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹19ని౹౹ వరకు 
వర్జ్యం : లేదు 
అమృతకాలం : మ. 12గం౹౹58ని౹౹ నుండి 02గం౹౹35ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹31ని౹౹కు


గురుబోధ
గొప్పవారు కనపడితే వారికి వినయంగా నమస్కరించాలి. మహాత్ములకు నమస్కరించడం అనేది కులగోత్రాలతో పని లేకుండా పాటించవలసిన భారతీయధర్మం. దీనిని పాటించకపోతే సద్గురువులకు ద్రోహం చేసిన వారము అవుతాము. భారతంలో ఒక పద్యం చెప్పారు ‘‘శూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబును ఎఱుగనగునే....’’ గొప్ప వీరులు, దేవతలు, ఏరులు ఇటువంటి వాటి జన్మ అనగా ఎలా పుట్టాయో అడగకూడదు, పవిత్రమైనవిగా చూడాలి. గంగ, కృష్ణ, గోదావరి పుట్టిన చోట చూస్తే పిసరంత మురికి నీరు కనపడుతుంది కానీ వాటి విస్తరణ ఎక్కువగా వ్యాపించి అందరినీ పవిత్రం చేస్తున్నాయి. ఎన్ని కాలుష్యాలు కలసినా గంగ గంగే అని వేదవ్యాసులు వారు చెప్పారు. - శ్రీ మహాభారతం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less