కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 15 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య ఉ.9.15 కు తదుపరి శు.పాడ్యమి 16 ఉ.6.44 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మృగశిర రా.9.02 కు తదుపరి ఆర్ద్ర 16 రా.7.30 కు
యోగం: గండ 16 తె.4:38 కు తదుపరి వృద్ధి 16 రా.12:34 కు
కరణం: కింస్తుఘ్న సా.6:26 కు తదుపరి బాలవ 16 మ.2:39 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు కు
దుర్ముహూర్తం: మ. 12.42 - 1.34 కు, మ. 3.18 - 4.11 కు
వర్జ్యం: రా.2.30-3.54 కు
అమృతకాలం: ఉ. 11.27 - 12.51 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు
🕉️ అధిక జ్యేష్ఠ అమావాస్య (పద్మకయోగం), సోమవతీ అమావాస్య, మిథునసంక్రమణం 🕉️
మిథునసంక్రమణం సమయం - ప.12.45 నుండి సూర్యాస్తమయం వరకు
గురుబోధ:
🕉️సోమవారం, అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతీ అమావాస్య అంటారు.
🕉️నిత్యకర్మలు అనగా ఉదయం సంధ్యావందనం, దేవతాపూజ, జపం, పారాయణం తప్పక చేయడం. నైమిత్తిక కర్మలు అనగా పండుగలు, పూర్ణిమ, అమావాస్య, సంక్రమణం మొ౹౹ పర్వదినములలో చేసే విశేషపూజలు, జపములు మొదలైనవి. నిత్యకర్మలు ఆచరించేవారికే నైమిత్తిక కర్మలు ఆచరించే అర్హత కలుగుతుందని శాస్త్రం.
🕉️పద్మకయోగం నాడు చేసే ఏ పుణ్య కార్యం అయినా అక్షయ ఫలితం ఇస్తుంది.
🕉️అమావాస్యలలో, సంక్రమణ సమయాలలో (అనగా సంక్రాంతి మరియు ఇతర సంక్రమణములలో), గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము. శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రం విన్నవారిని రక్షించే బాధ్యత తనదేనని, రక్షణకై తన సుదర్శన చక్రమే పంపుతానని అన్నాడు. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం.
https://youtu.be/UwFKCtE_fRU?si=4k_rp4CZlORzWYuF
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-mahavishnu-vedastuti-galava-muni-krutham/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial