కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 15 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్థి సా.4.00 కు తదుపరి పంచమి 16 మ.3.10 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: శ్రవణం రా.11.51 కు తదుపరి ధనిష్ఠ 16 రా.11.34 కు
యోగం: ఐంద్ర మ.12:19 కు తదుపరి వైధృతి ఉ.11:06 కు
కరణం: బాలవ మ.3.51 కు తదుపరి కౌలవ రా 3.45 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.5:03-5:55 కు
వర్జ్యం: రా.3.49-5.23 కు
అమృతకాలం: మ.02:19-03:57 కు
సూర్యోదయం: ఉ. 5:28 కు
సూర్యాస్తమయం: సా. 6:30 కు
🕉️ మిథున సంక్రమణం - పుణ్యకాలం: జూన్ 15, 2025 - ఉ.06:53 కు - మ.02:20 కు 🕉️
గురుబోధ:
ఏదో ఒక భగవత్ సాధన చేసి దేవతా అనుగ్రహం పొందాలి. సాధనలో పురాణశ్రవణం, మంత్ర జపం, నామ జపం, భజన, భగవత్ పూజ, పారాయణం లేదా భగవత్ సేవ మొ౹౹ ఉత్తమమైనవి.