June 15 2023జూన్ 15 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 15 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : ద్వాదశి ఉ. 09గం౹౹13ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : భరణి మ. 03గం౹౹10ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : సుకర్మ రా. 02గం౹౹03ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :  తైతుల ఉ. 08గం౹౹32ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹42ని౹౹ వరకు & మ. 03గం౹౹03ని౹౹ నుండి 03గం౹౹56ని౹౹ వరకు 
వర్జ్యం : తె. 03గం౹౹17ని౹౹ నుండి 04గం౹౹54ని౹౹ వరకు 
అమృతకాలం : ఉ. 11గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹31ని౹౹కు

🕉️జ్యేష్ఠ కృష్ణ ద్వాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈరోజు ఉ. 9 గం.ల లోపు చెయ్యాలి.

గురుబోధ
జ్యేష్ఠ కృష్ణ ద్వాదశి కూర్మద్వాదశి అనబడుతుంది. ఈనాడు శ్రీమన్నారాయణుడు కూర్మరూపంలో భూమిని సముద్రంలో మునిగి పోకుండా మూపున నిలబెట్టుకున్నాడు. వెండి, రాగి, ఇత్తడి వంటి లోహాలతో కూర్మరూపాలు తయారుచేసి గంగానదిలో కలపటం ఒక ఆచారం. కాశీగంగలో ఈ ద్వాదశి నాడు మత్స్య, కూర్మ, మకర ప్రతిమలు గంగకి  అర్పిస్తారు. ఇలా చేస్తే సంసార వ్యామెాహాలు నశిస్తాయి, హంసజ్ఞానం లభిస్తుందని వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు. (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం )

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less