June 14 2026జూన్ 14 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 14 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి ఉ.11.42 కు తదుపరి అమావాస్య 15 ఉ.9.15 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: రోహిణి రా.10.48 కు తదుపరి మృగశిర 15 రా.9.02 కు
యోగం: శూల ఉ.8:55 కు తదుపరి గండ 15 తె.4:38 కు
కరణం: శకుని మ.12:20 కు, చతుష్పాద రా.10:22 కు తదుపరి కింస్తుఘ్న 15 సా.6:26 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 5.02 - 5.54 కు
వర్జ్యం: మ.3.20 - 4.50 కు, తె.4.01 - 5.30 కు
అమృతకాలం: సా. 07.24 - 08.48 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు

🕉️ పితృకార్యములకు అమావాస్య 🕉️

గురుబోధ:
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. భూలోకంలో ఉన్న వారికి పగలు, రాత్రి కలిస్తే ఒక  రోజు అంటారు. దేవతలకు ఉత్తరాయణం, దక్షిణాయనం  కలిపితే ఒక రోజు (అంటే మనకు ఒక సంవత్సరం). పితృదేవతలకు శుక్ల పక్షము, కృష్ణ పక్షము కలిస్తే ఒక రోజు (మనకు 30 రోజులు). అందుకే ప్రతి నెల అమావాస్య నాడు వారికి తప్పక తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం చేయాలి. స్వర్గస్తులైన వారు ఎవ్వరైనా సరే (బంధువులు, స్నేహితులు), వారి పేరు మీద తర్పణాలు, స్వయంపాకం (వంట సరుకులు, కూరగాయలు) బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. పితృతర్పణాలు అర్హత కలిగిన వారు మాత్రమే ఇవ్వాలి. స్వయంపాకం ఎవ్వరైనా ఇవ్వవచ్చు.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=xlMG7zDtuOiFaZLX
అమావాస్య కథ👇
https://youtu.be/OBwT8oxE1z4?si=3_VJAjj6xXYfX0kx
శ్రీ శివ కేశవ అష్టోత్తరం👇
https://youtu.be/1MoC79bhXT0?si=0LegEL-T8eJTbTHA

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less